గతంలో సింహా, లెజెండ్ మూవీలతో సూపర్ హిట్స్ అందుకున్న బాలయ్య,బోయపాటి శ్రీను తాజాగా ప్రేక్షకుల ముందుకు అఖండ మూవీతో వచ్చారు.మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తాను చూపుతూ కలెక్షన్స్ రాబడుతోంది.ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయం కారణంగా థియేటర్స్ లో టికెట్ ధరలపై సినీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారు.అందుకే వాళ్ళ మూవీ విడుదలను వాయిదా వేసుకుంటున్నారు.సురేష్ బాబు లాంటి బడా నిర్మాత ఏపి ప్రభుత్వం నిర్ణయం వల్ల మాకు గిట్టుబాటు అవ్వదని దృశ్యం2 ని ఓటిటి వేదికగా విడుదల చేశారు.ఇలాంటి నేపథ్యంలో కేవలం బాలయ్యను నమ్ముకొని బరిలోకి దిగిన నిర్మాతలకి ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తుంది.
టాలీవుడ్ లో ఏ దర్శకుడు చూపించలేనంత అందంగా బోయపాటి శ్రీను అఖండ మూవీలో బాలయ్యను చూపించారు.బాలయ్య లుక్స్,డైలాగ్స్,మ్యానరిజం మూవీకి పెద్ద ప్లస్ అయ్యాయి.గతంలో వీరి కాంబోలో వచ్చిన రెండు చిత్రాలను ఈ మూవీ అన్ని విధాల బీట్ చేసింది.ఈ మూవీ బాలయ్య క్రేజ్ ఇండియాలోనే కాదు యు.ఎస్,యు.కే లాంటి చోట్ల కూడా ఉందని నిరూపిస్తూ సత్తా చాటుతుంది.ఈ మూవీలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్,యాక్షన్ సీక్వెన్స్ ప్రస్తుతం థియేటర్స్ లో అభిమానుల చేత ఈలలు వేయిస్తుంది.
ఈ మూవీ రిజల్ట్ చూసిన వారంతా బాలయ్య క్రేజ్ ను చూసి అవాక్కవుతున్నారు. ఈ వీకెండ్ విక్టరీ అందుకున్న అఖండ బోయపాటి,బాలయ్య కాంబోకు మరవలేని ఒక సూపర్ హిట్ ఇచ్చి వీరి కాంబో అన్ స్టాపాబుల్ అని మళ్ళీ నిరూపించింది.