దాదాపు ఫినాలే దగ్గరకు వచ్చేసిన బిగ్ బాస్ లో షన్ను,సన్నీ గ్రూప్ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది.బిగ్ బాస్ రేసు టు ఫినాలే టాస్క్ లో ఈ ఉదంతం జరిగింది.దీనికి సంబంధించిన గొడవ ఈరోజు కూడా కంటిన్యూ కాబోతుంది అనే విషయం నిన్న రాత్రి ప్రోమో చూస్తే అర్థమైపోతుంది.ఇక ఈ వీక్ హౌస్ నుండి బయటికి వెళ్ళడానికి సిరి,మానస్,శ్రీరామ్ చంద్ర,కాజల్,ప్రియాంక సింగ్ నామినేట్ అయ్యారు.వీరిలో ఈ వారం ఇంటి నుండి ఎవరు బయటికి వెళ్తారో? టాప్ 5లో స్థానం దక్కించుకునేది ఎవరో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్న వారిలో మానస్,శ్రీరామ్ చంద్ర లకు బిగ్ బాస్ అభిమానులలో మంచి ఆదరణ ఉంది కాబట్టి వీరిద్దరికీ నెక్స్ట్ వారం ఓటింగ్ పరంగా ఎలాంటి ఢోకా ఉండదు.కానీ నిన్న జరిగిన టాస్క్ లో శ్రీరామ్ చంద్ర గాయపడ్డారు దాని నుండి కోలుకునే అవకాశాలు లేకుంటే శ్రీరామ్ ఈవారం ఇంటి నుండి బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఇక నామినేషన్స్ లో ఉన్న ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ లో సిరి మిగతా ఇద్దరితో పోలిస్తే స్ట్రాంగ్ గా ఉంది కానీ ఆమె ప్రవర్తనపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.కాబట్టి ఈ వీక్ ఆమెకు ఓటింగ్ శాతం తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక హౌస్ లో ప్రస్తుతం సన్నీతో జట్టు కట్టిన కాజల్ సన్నీ ఫ్యాన్స్ వల్ల ఈ వీక్ కూడా సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.పాపం మొదటి నుండి అందరికీ వండి పెడుతున్న ప్రియాంక ఇటు హౌస్ లోను, అటు బిగ్ బాస్ అభిమానులలోను ఆశించిన ఆదరణను అందుకోలేక డేంజర్ జోన్ లో నిలిచింది.