సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ నుంచి చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ విడుదల చేస్తూ మూవీ పై అంచనాలను పెంచుతున్నారు.డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ గురించి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ను విడుదల చేసింది.బన్నీ,రష్మీక మందాన కలిసి జంటగా నటిస్తున్న ఈ మూవీ నుండి మరో అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 12వ తేదీన హైదరాబాద్ వేదికగా చిత్ర యూనిట్ నిర్వహించాలనే ప్లాన్ లో ఉందట.ఈ వేడుకకు బన్నీ స్నేహితుడైన ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం.