టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీలో టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన సాంగ్స్, ప్రోమోలు సినిమా పై అంచనాలను పెంచేశాయి.ప్రస్తుతం పగలు రాత్రి తేడా లేకుండా చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ వైరల్ అవుతుంది.
దాని ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ కు కేవలం 15 నిమిషాలు మాత్రమే స్క్రీన్ స్పేస్ ఉండనుంది ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్ ఈమెతో 10 రోజుల షూట్ ను నిర్వహించారు.అయితే ఈ పది రోజుల షూట్ కు ఆలియా భట్ ఏకంగా 5 కోట్లు వసూలు చేసిందట అంటే రోజుకి ఏకంగా 50 లక్షల ఛార్జ్ చేసింది.ఈ న్యూస్ వైరల్ అవుతుండడంతో అమ్మో బాబోయ్ ఆలియా భట్ టు కాస్ట్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.