బోయపాటి దర్శకత్వంలో బాలయ్య ముచ్చటగా మూడవసారి చేస్తున్న అఖండ మూవీ రిలీజ్ కి ముస్తాబవుతుంది.ఈ మూవీలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపిస్తుంటే ప్రగ్య జైస్వాల్ కలెక్టర్ గా కనిపించబోతుంది.తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది దీంతో ఈ మూవీ రిలీజ్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఒక అప్డేట్ ను విడుదల చేసింది.దాని ప్రకారం ముందుగా ఈ మూవీకి చిత్ర యూనిట్ ‘ మహర్ జాతకుడు ‘ అనే టైటిల్ ను పెట్టాలనే ఆలోచనలో ఉన్నదని తర్వత దాని బదులు అఖండ అనే టైటిల్ ను ఖరారు చేసిందని సమాచారం.