రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ నుండి తాజాగా జనని అనే ఎమోషనల్ మెలోడీ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ సాంగ్ లో మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్న వారంతా కనిపించబోతున్నారు.
ఇక ప్రస్తుతం అందిన సమాచారం మేరకు చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయబోతుందట.అలాగే చిత్ర యూనిట్ మూవీకి సంబంధించి 5-6 ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను నిర్వహించే ప్లాన్ లో కూడా ఉందని సమాచారం.రిలీజ్ కు ముందే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిస్తున్న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.