సుకుమార్ దర్శకత్వంలో బన్నీ, రష్మీక మందాన కలిసి నటిస్తున్న పుష్ప మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.ఈ మూవీలో తాజాగా సమంత ఒక ఐటెం సాంగ్ చేయనున్నది.ప్రస్తుతం ఈ మూవీలోని కీలక సన్నివేశాలు,ఐటెం సాంగ్ చిత్రీకరణ పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ రాత్రి,పగలు షూటింగ్ చేస్తున్నారు.ఇంత టైట్ షెడ్యూల్ లో షూటింగ్ చేస్తున్న చిత్ర యూనిట్ కి తాజాగా ఒక షాక్ తగిలింది.గత కొద్దిరోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్న దర్శకుడు సుకుమార్ తాజాగా అనారోగ్యానికి గురయ్యారు.కానీ మేకర్స్ షూటింగ్స్ ను ఆపే ప్లాన్ లో లేరని సమాచారం.
ఈరోజు సమంత పై చిత్రకరించే సాంగ్ ను చిత్రకరిస్తున్నారు అన్ని అనుకున్నట్టు జరిగితే ముందుగా చెప్పినట్టే ఈ మూవీ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొస్తుంది లేకుంటే మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ మూవీ ప్రమోషన్స్ పై ప్రభావం పడుతుంది.