ఇండస్ట్రీలో కొన్నిసార్లు స్టార్ హీరోలు పాత్రలు నచ్చకో,కథ నచ్చకో వదిలేసుకున్న సినిమాలు కొన్నిసార్లు సూపర్ హిట్ లయితే మరికొన్నిసార్లు ఘోరమైన డిజాస్టర్స్ గా నిలుస్తుంటాయి.అలా అక్కినేని వారసుడు నాగ చైతన్య కాదన్న కొన్ని చిత్రాలు లిస్ట్ ను ఆయన బర్త్ డే సందర్భంగా చూద్దాం.
కొత్త బంగారులోకం : వరుణ్ సందేశ్,శ్వేత బసు ప్రసాద్ నటించిన ఈ చిత్రం అప్పట్లో ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.ఈ మూవీతో నాగ చైతన్య టాలీవుడ్ డెబ్యూ చేయాల్సివుంది కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు.
గౌరవం : ఈ మూవీతో టాలీవుడ్ లోకి డెబ్యూ చేసిన అల్లు శిరీష్ కు తొలి సినిమానే చేదు అనుభవాన్ని మిగిల్చింది.అసలు ఈ మూవీలో నాగ చైతన్య చేయాల్సివుంది కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు.
భలే భలే మగాడివోయ్ : వరస ఫ్లాప్ లతో సతమతవుతున్న నానికి లైఫ్ ఇచ్చిన ఈ మూవీ ముందుగా చైతూ దగ్గరకే వెళ్ళింది కాని ఇది ఎందుకో చైతూ మిస్ చేసుకున్నాడు.
అఆ : త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ చైతూ మిస్ చేసుకున్నాకే నితిన్ దగ్గరకు వెళ్ళింది.
సమ్మోహనం : చైతూ మిస్ చేసుకున్న సూపర్ హిట్స్ లో ఇది కూడా ఒకటి చైతూ తర్వాత ఈ అవకాశం సుధీర్ బాబుకి వెళ్ళింది.
రిపబ్లిక్ : రీసెంట్ గా మెగా మేనల్లుడు సూపర్ హిట్ అందుకున్న రిపబ్లిక్ మూవీ కథను ముందుగా దర్శకుడు చైతూకి వినిపించారు.చైతూకి కథ నచ్చినప్పటికి ఆయన ఈ మూవీలో భాగం కాలేకపోయారు.
మహా సముద్రం : అజయ్ భూపతి ముందుగా ఈ కథని చైతూకి వినిపించాడు కానీ చైతూ ఈ మూవీ కమిట్ అవ్వలేదు.
వరుడు కావలెను : ఈ స్టోరీ ముందు నాగ చైతన్య తలుపు తట్టింది ఆయన కాదనడంతో ఈ మూవీలో నాగ సూర్య వచ్చారు.