ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కు సమయం కేటాయించిన ఎన్టీఆర్ అవి పూర్తయ్యాక బ్రేక్ లేకుండా తన తదుపరి మూవీ షూటింగ్స్ లో పాల్గొన్నబోతున్నారు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు.రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఎన్టీఆర్ ఫిబ్రవరి నుండి పాల్గొన్నబోతున్నారు ఈలోపు దర్శకుడు మూవీ షూటింగ్ మిగతా నటీనటులతో చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
ఇక వచ్చే ఏడాది అక్టోబర్ లో ఎన్టీఆర్ కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.ఈ మూవీ కె.జి.ఎఫ్ కంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లాన్ లో దర్శక,నిర్మాతలు ఉన్నారని సమాచారం.