బోయపాటి దర్శకత్వంలో బాలయ్య ముచ్చటగా మూడవసారి చేస్తున్న అఖండ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు.ఈ మూవీలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పాటలు,ట్రైలర్స్ చిత్రంపై భారీ అంచనాలను పెంచేశాయి.డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
మూవీని చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చారు.భారీ ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఏ రేంజ్ బిజినెస్ చేస్తుందో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.