సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వస్తున్న దృశ్యం సీక్వెల్ ను ముందుగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని భావించిన సురేష్ బాబు తాజాగా ఓటిటి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ ఈ నెల 25వ తేదీన విడుదల కానున్నది.వెంకటేష్,మీనా జంటగా నటిస్తున్న దృశ్యం సీక్వెల్ కు ఈ మూవీ ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫే దర్శకత్వం వహిస్తున్నారు.
ముందుగా ఈ మూవీ కోసం డిస్నీ హాట్ స్టార్ తో ఒప్పందం కుదుర్చుకున్న సురేష్ బాబు రెండు కోట్లు ఎక్కువ ఆఫర్ చేయడంతో ఈ మూవీని అమెజాన్ కు ఇచ్చారు.తమతో ఒప్పందం కుదుర్చుకొని సినిమాను అమెజాన్ కు అమ్మడం పట్ల అసంతృప్తిగా ఉన్న హాట్ స్టార్ ఇప్పుడు లీగల్ యాక్షన్ కు రెడీ అవుతుందని సమాచారం.ఒకవేళ ఇదే జరిగితే దృశ్యం2 రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.