టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో కలిసి లాల సింగ్ చద్దా అనే మూవీ చేస్తున్నారు.ఈ మూవీతో అక్కినేని వారసుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.క్రిస్మస్ కు రావాల్సిన ఈ మూవీ తన రిలీజ్ ను వాయిదా వేసుకొని ఫిబ్రవరికి రాబోతున్నట్లు ప్రకటించింది.
తాజాగా బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేర ఈ మూవీ ఫిబ్రవరి రిలీజ్ ను మరోసారి వాయిదా వేసుకొని వచ్చే ఏడాది సమ్మర్ కు రావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ ఇది నిజమైతే సమ్మర్ కు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న కె.జి.ఎఫ్2 కు నార్త్ లో థియేటర్స్ దొరకడం కష్టమవుతుంది.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ప్రచారంలో నిజమెంత తెలియాల్సివుంది.