సుకుమార్ దర్శకత్వంలో బన్నీ రష్మీక మందాన కలిసి నటిస్తున్న పుష్ప మూవీ నుండి చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ మూవీ అప్డేట్స్ ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.దాని ప్రకారం ఈ మూవీలో ఉన్న ఐటం సాంగ్ కోసం ప్రస్తుతం చిత్ర యూనిట్ ఇద్దరు ముద్దుగుమ్మలను పరిగణలోకి తీసుకుంది.
ఇందులో ఒకరు పూజ హెగ్డే కాగా మరొకరు తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలకు లక్కి చార్మగా మారిన పూజ హెగ్డే ను ఫస్ట్ ఛాయిస్ గా చిత్ర యూనిట్ పరిగణిస్తుందని సమాచారం.