బుల్లితెర మీద తన షోలతో వెండితెర మీద తన సినిమాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ప్రస్తుతం అరడజన్ పైగా సినిమాలను లైన్ లో పెట్టారు.దీంతో ఆయన రానున్న మూడేళ్లు ఫుల్ బిజీ అయిపోయారు.ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయాల్సివుంది ఆ షూటింగ్ ను తాజాగా వాయిదా వేసుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారట రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్,చరణ్ లను రెండు నెలల సమయం కేటాయించాలని కోరారట అందుకోసమే ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.ఫిబ్రవరి నుండి ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.