పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ అయిపోయారు.ఆయన రానాతో కలిసి చేస్తున్న భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ ఈ నెలాఖరుకి పూర్తి కానున్నది.దీంతో పవన్ కళ్యాణ్ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.సరిగ్గా ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ సర్కిల్స్ లో పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారని,దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారని దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది.మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సివుంది.