సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వస్తున్న దృశ్యం సీక్వెల్ ను ముందుగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని భావించిన సురేష్ బాబు తాజాగా ఓటిటి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ క్రిస్మస్ కి విడుదల కానున్నది.వెంకటేష్,మీనా జంటగా నటిస్తున్న దృశ్యం సీక్వెల్ తెలుగు వెర్షన్ కు ఈ మూవీ ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫే దర్శకత్వం వహిస్తున్నారు.
ఐజీ సస్పెన్షన్ తో ముగిసిన మొదటి భాగం కంటిన్యూషన్ గా ఈ సీక్వెల్ ఉండబోతుంది.ఫస్ట్ పార్ట్ లో నటించిన కాస్ట్ లో ఉన్న మెజారిటీ సభ్యులను ఈ మూవీలో కొనసాగిస్తున్నారు.అమెజాన్ లోనే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన మలయాళ దృశ్యం 2 మ్యాజిక్ ను తెలుగులో ఈ మూవీ రిపీట్ చేయగలదా లేదా అనేది వేచి చూడాలి.