యువ హీరో నితిన్ తాజాగా పూరీ జగన్నాథ్ శిష్యుడు ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దాని ప్రకారం ఆరోగ్య సమస్యల రీత్యా ప్రస్తుతం సినిమాల సంఖ్యను బాగా తగ్గించుకున్న బ్రహ్మానందం చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీలో నటిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ తాజాగా వైజాగ్ లో 10 రోజుల షెడ్యూల్ ను వేసింది.ఈ షెడ్యూల్ లో బ్రహ్మానందం కూడా పాల్గొంటున్నారు.మూవీ దర్శకుడు ఎన్నిసార్లు చెప్పిన వినకుండా బ్రహ్మానందం మూవీ సెట్స్ కు చాలా లేట్ గా వస్తున్నాడు అలాగే డైరెక్టర్ కోరిన విధంగా బ్రహ్మానందం చేయకుండా తనకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నారట ఇదంతా చూసిన నితిన్ బ్రహ్మానందం ప్రవర్తనతో విసుగు చెందాడు అందుకే ఆయన్ని ఈ మూవీ నుండి తప్పించరని నితిన్ తీసుకున్న నిర్ణయం వల్ల నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డికి 50 లక్షల నష్టం వచ్చిందని ప్రచారం జరుగుతుంది మరి ఇందులో నిజమెంతో ఉందో తెలియాల్సివుంది.