కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన జై భీమ్ ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.డీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని దూసుకుపోతుంది.గతంలో దళిత వర్గానికి చెందిన వారు సమాజంలో ఎలాంటి వివక్షకు గురయ్యేవారు,పోలీసులు ఆ వర్గం వారిని ఎలా ట్రీట్ చేసేవారు అనేది కళ్ళకు కట్టినట్టు ఈ మూవీలో చూపించారు.వివక్షకు గురైన ఆ వర్గానికి అండగా నిలబడి రూపాయి ఫీజ్ కూడా తీసుకోకుండా కేసులు వాదించిన లాయర్ చంద్రు పాత్రలో ఈ మూవీలో సూర్య కనిపించి మెప్పించాడు.
10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ 45 కోట్లకు కొనుగోలు చేసింది.ఈ మూవీ ద్వారా మేకర్స్ 35 కోట్ల లాభాన్ని పొందారు.