జై భీమ్ మూవీలో సూర్య లాంటి స్టార్ పక్కన సినతల్లిగా నటించి తన పాత్ర గురించి ప్రేక్షకుల గురించి మాట్లాడుకునేలా చేసిన లిజోమోల్ జోస్ గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1992లో కేరళలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన లిజోమోల్ జోస్ అమెరికన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఆతర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది.కొంతకాలం టీవీ ఛానల్‌లో పని చేసిన లిజో ఆ సమయంలో ఫాహద్ ఫాజిల్ నటించిన మహేశింటే ప్రతీకారం సినిమా ఆడిషన్స్ నిర్వహించారు.ఆ ఆడిషన్స్ కు అటెండ్ అయిన లిజోకు ఆ మూవీలో హీరోయిన్ గా అవకాశం దక్కింది.ఆతర్వాత రిత్విక్ రోషన్,హనీ బీ 2.5,స్ట్రీట్‌లైట్స్, ప్రేమసూత్రం, వత్తకోరు కాన్ముకన్ వంటి మూవీలతో కేరళ సినీ అభిమానులను లిజో తన మాయలో పడేసింది.శివప్పు మంజల్ పచ్చాయ్ ద్వారా లిజో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది.ఆ మూవీని తెలుగులో ఒరేయ్ బామ్మర్దిగా డబ్ చేశారు.ఈ మూవీలో లిజో నటనకు ముగ్ధుడైన దర్శకుడు జ్ఞానవేల్ ఆమెకు జై భీమ్ లో సినితల్లిగా అవకాశం ఇచ్చారు.ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకున్న ఆమె అందరి మనసులను దోచుకున్నారు.ప్యూర్ డీగ్లామ్ లుక్‌లో, నిండు గర్భణిగా కనిపించిన లిజో తాజాగా ఆ పాత్రకు తను ఎంత కనెక్ట్ అయ్యారో చెప్పారు. గతంలో నేను చేసిన ఏ పాత్ర నన్ను ఇంతలా ప్రభావితం చేయలేదని ఇప్పటికీ సినితల్లి పాత్ర నుంచి నేను పూర్తిగా బయటకు రాలేకపోయానని ఆ పాత్ర అనుభవించిన బాధ, ఆవేదన ఇంకా నాలోనే ఉన్నాయని ఆమె అన్నారు. సినితల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పే సమయంలో కూడా నేను ఏడ్చేసేదాన్ని ఆ పాత్రతో తనకున్న బంధం గురించి లిజో తెలిపారు.