శంకర్ కు నిర్మాణ సంస్థ లైకాకు విబేధాలు తలెత్తడంతో ఆగిపోయిన ఇండియన్ 2 షూటింగ్ తాజాగా దర్శకుడు శంకర్, లైకాకు జరిగిన చర్చలు సఫలం కావడంతో మళ్ళీ పట్టలెక్కబోతుంది.ఈ మూవీలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీ అర్థాంతరంగా ఆగిపోవడంతో దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ తో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ మూవీలో చరణ్ సరసన కీయార అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది.ఇప్పుడు ఇండియన్ 2 మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ మూవీ వాయిదా పడతుంది.దీంతో రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం జెర్సీ మూవీ డైరక్టర్ తో జత కడుతున్నాడని సమాచారం.