తన షోలు,స్కిట్ లతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సుడిగాలి సుధీర్ వెండి తెర హీరోగా వెలుగొందాలని మధ్యలో హీరోగా కొన్ని చిత్రాలలో నటించారు అవి అసలు అచ్చిరాకపోవడంతో బుల్లితెర మీద బ్యాక్ టు బ్యాక్ షోలు చేస్తూ అడపాదడపా సినిమాలలో కనిపిస్తూ బాగా బిజీ అయిపోయాడు.స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ కోసం యాంకర్ రష్మితో ప్రేమాయణం నడిపే సుధీర్ నిజ జీవితంలో తను ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోవడంతో ప్రేమ,పెళ్లికి ఇన్నాళ్లు దూరంగా ఉంటూ వస్తున్నారు.ఏజ్ బారవుతున్న సుధీర్ కు ఎలాగైనా పెళ్లి చేయాలని రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను,సుధీర్ కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు తాజాగా సక్సెస్ అయ్యాయి. ఇంతకాలం పెళ్లికి దూరంగా ఉన్న సుధీర్ ఎట్టకేలకు తన పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
దీంతో సుధీర్ కుటుంబానికి చెందిన సన్నిహితులు అతని కోసం కృష్ణ జిల్లాకి చెందిన ఒక సంబంధం కుదిర్చినట్లు సమాచారం.దీంతో 34 ఏళ్ల సుధీర్ చివరకి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.ప్రస్తుతం జబర్దస్త్,శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ చేస్తూ జనాలను ఎంటర్ టైన్ చేస్తున్న సుధీర్ ఒక ఇంటివాడు అవుతున్నాడని తెలియడంతో సుధీర్ అభిమానులు ఆనందానికి అవధులు లేవు.