సినిమా రివ్యూలు ఇవ్వడం ప్రస్తుతం తెలుగునాట పెద్ద మార్కెట్ గా మారింది.అందుకే మొదట మూవీని చూసి రివ్యూ రాసేవాడు సినిమా వారి నుండి డబ్బు ఆశిస్తున్నాడు.అది వాళ్ళు ఇవ్వకపోతే వెంటనే ఆ కక్షను రివ్యూ రూపంలో చూపిస్తున్నారు.ఆ రివ్యూ చదివిన మిగతా రివ్యూ రైటర్ లు సినిమా చూడకుండా ఆ రివ్యూ నే కిందా పైన చేసి మరో రివ్యూ రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు.సినిమాకు వెళ్ళాలంటే సామాన్యుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తున్న నేపథ్యంలో వారు చూసేదేదో మంచి సినిమానే చూడాలని రివ్యూలు చదివి వెళ్తున్నారు.దీంతో మంచి సినిమా చచ్చిపోతుంది.గతంలో ఈ విషయాన్నే ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ,పూరి జగన్నాథ్ వంటి వారు కూడా అడ్రస్ చేశారు.కానీ ‘మా’ దీనిపై సరిగ్గా దృష్టి సారించకపోవడంతో ఈ ఫేక్ రివ్యూ రైటర్స్ పబ్బం జరిగిపోతుంది.
తాజాగా ఈ ఫేక్ రివ్యూ రైటర్స్ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లి సందD గురించి బ్యాడ్ రిపోర్ట్స్ ఇచ్చారు.దీంతో చాలామంది ప్రేక్షకులు ఈ రివ్యూ రిపోర్ట్స్ వల్ల మిస్ లీడ్ అయ్యి ఆ మూవీతో పాటు విడుదలైన మిగతా మూవీలకి వెళ్లారు.దీంతో పెళ్లి సందD మూవీ థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ మూట కట్టుకున్నప్పటికి ప్రొడ్యూసర్స్ కు మాత్రం బంగారు బాతు అయ్యింది.
ఈ మూవీ
1). నైజాంలో -2.8 కోట్లు
2). సీడెడ్ లో-1.55 కోట్లు
3). ఉత్తరాంధ్రలో -1.6 కోట్లు.
4). గుంటూరులో-64 లక్షలు.
5). వెస్ట్ లో-40లక్షలు.
6). ఈస్ట్ లో-53లక్షలు
7). నెల్లూరులో-35 లక్షలు
8). కృష్ణలో-45 లక్షలు
వసూలు రాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు గాను 7.6 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.5.2 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 7.66 కోట్లను వసూలు చేసి బయ్యర్లకు 2.46 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది.