ప్రస్తుతం ఉప ఎన్నికలలో వచ్చిన ఫలితాల పుణ్యాన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలలో తమ పట్ల ఎంత అసంతృప్తిగా ఉందో తెలియడంతో కేంద్రం దిగొచ్చింది.పెట్రోల్,డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.దీంతో గ్యాప్ లేకుండా రోజూ పెరుగుతూ పోతున్న ధరలకు చిన్నపాటి బ్రేక్ పడింది.కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వట్లేదు దీంతో కేంద్ర పెట్రోల్,డీజిల్ ధరలను రానున్న కాలంలో మరింత తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సరిగ్గా ఇలాంటి టైంలో ఇందన నిపుణుడు నరేంద్ర తనేజా 2023 నాటికి పెట్రోల్ ధర 200కు చేరుకునే అవకాశం ఉందని జోస్యం చెబుతున్నారు.ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న చమురులో 86 శాతం చమురును విదేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి చమురు ధరలు అనేది డిమాండ్ సప్లై ను బట్టి ఉంటుందని దీని నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండదని ఆయన స్పష్టం చేశారు.