ప్రస్తుతం మోడీ సర్కార్ జమ్ము కాశ్మీర్ లో పరిస్థితులు చక్కదిద్దేందుకు సీరియస్ గా ప్రయత్నిస్తుంది.సరిగ్గా ఇలాంటి టైంలో అక్కడ లోకల్ లీడర్స్ బిజేపి అధిష్టానంపై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది బిజేపికి అక్కడ పెద్ద శాపంగా మారుతోంది అందుకే వాటికి చెక్ పెట్టేందుకు బిజేపి వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.జమ్ము కాశ్మీర్ కు చెందిన గులామ్ నబీ ఆజాద్ ప్రధాని మోడీతో ఈ మధ్య సన్నిహితంగా మెలుగుతున్నాడు అలాగే ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు అందుకే ఆయనకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టొచ్చు అనే ఆలోచనలో బిజేపి ఉన్నట్టు సమాచారం.