కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ మూవీ తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మూవీలో ఉన్న కామెడీ సీన్స్,శివ కార్తికేయన్ పర్ఫార్మెన్స్,ప్రియాంక అరుల్ మోహన్ బబ్లి నటన,దర్శకుడు నెల్సన్ స్క్రీన్ ప్లే తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది.తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్,పెళ్లి సందడి చిత్రాలకు గట్టి కాంపిటీషన్ ఇచ్చిన ఈ మూవీ ఓవర్ ఆల్ గా అన్ని భాషలలో ఇప్పటివరకు వంద కోట్లను వసూలు చేసింది.
మరి అలాంటి ఈ మూవీ వచ్చే నెల 5వ తేదీన ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి అందులో నిజమెంతో తెలియాల్సివుంది.