ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఈరోజు ఉదయం ఇంట్లో జిమ్ చేస్తున్న సమయంలో గుండెనొప్పి రావడంతో ఉన్న చోటే కుప్పకూలిపోయారు.దీంతో ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు.ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెంటనే హాస్పిటల్ కు చేరుకొని అక్కడ డాక్టర్ లతో పునీత్ రాజ్‌కుమార్ ఆరోగ్య పరిస్తితి పై అరా తీస్తున్నారు
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు.ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తూ చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపారు. మీడియా కథనాల ద్వారా విషయం తెలుసుకున్న పునీత్ అభిమానులు విక్రమ్ హాస్పిటల్ కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ వద్దకు వస్తుండడంతో ముందు జాగ్రత్తల చర్యలలో భాగంగా పోలీసులు అక్కడికి చేరుకొని కట్టు దిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
సరిగ్గా డాక్టర్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కొద్దిసేపటికి మంచు లక్ష్మీ ఇది నిజం కాదు పునీత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తన ఆత్మకు మన శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.దీంతో పునీత్ మరణించాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఈ ఏడాది యువరత్న మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పునీత్ రాజ్‌కుమార్ మరణంపై తెలుగు సినీ అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు