సుకుమార్ దర్శకత్వంలో ముచ్చటగా మూడవసారి అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ కోసం ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది.ఈ ప్రమోషన్స్ ను సినీ అభిమానులను బాగా ఇంప్రెస్ చేస్తుంది.ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అవ్వగా తాజాగా ఈ చిత్ర యూనిట్ సామి సామి అంటే సాగే పాటను రిలీజ్ చేసింది.
చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చిన ఈ పాటను మౌనిక యాదవ్ పాడారు.వినడానికి వినసొంపుగా ఉన్న ఈ పాటను మిగతా భాషలలో కూడా ఈరోజే రిలీజ్ చేశారు.ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ పాటపై మీరు కూడా ఓ లుక్కేయండి