భారత్ టి20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో క్రికెట్ సీనియర్స్ భారత్ టీమ్ కు తమ సలహాలు ఇస్తున్నారు.తాజాగా ఇలాంటి సూచనలే మాజీ ఆస్ట్రేలియాన్ పేసర్ బ్రెట్ లీ కూడా చేశారు.
తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారత్ స్టార్ ఆల్ రౌండర్ అయిన హార్దిక పాండ్యా చేత టీమ్ మ్యానేజ్ మెంట్ బౌలింగ్ చేయించాలి అలా కాకుంటే అతని ప్లేస్ ను రీప్లేస్ చేయాలని అలాగే సీనియర్ బౌలర్ అయిన భువనేశ్వర్ తిరిగి ఫామ్ లోకి రావాలి లేకుంటే భారత్ కు గడ్డు కాలం రాక తప్పదని బ్రెట్ లీ అన్నాడు.ఈ టోర్నీలో భారత్ సెమీస్ కు చేరాలంటే పూర్తి స్థాయిలో ఆడాల్సి ఉందని ఆయన బిసిసిఐకు గుర్తు చేశారు.