2012లో తెలుగు పరిశ్రమకు పరిచయమైన లావణ్య ఇప్పటివరకు తెలుగులో మొత్తం 16కు పైగా సినిమాలలో నటించి తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు.ఈమె ఈ ఏడాది చావు కబురు చల్లగా మూవీలో మల్లికగా కనిపించి అందరినీ మెప్పించి ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది.అయితే తాజాగా లావణ్య త్రిపాఠి ఉత్తరాఖండ్ లోని 8,848 మీటర్ల ఎత్తులో ఉండే జార్జ్ ఎవరెస్ట్ ను అధిరోహించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇది చూసినవారంతా అందం,టాలెంట్,సాహసం లావణ్య లాగా అందరి దగ్గర ఉండవు ఎంతైనా లావణ్య ఈజ్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.