జాతి రత్నాలు మూవీతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకున్న దర్శకుడు అనుదీప్ ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నారు.మొదట రెండు మూవీస్ ను చిన్న బడ్జెట్ చిత్రాలుగా తెరకెక్కించిన దర్శకుడు ఈసారి మాత్రం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట మరి దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రీసెంట్ గా తెలుగులో డాక్టర్ మూవీతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తమిళ హీరో శివ కార్తికేయన్ తన తదుపరి చిత్రాన్ని అనుదీప్ తో చేయాలనే ప్లాన్ లో ఉన్నారట.ఈ మూవీని ఏషియన్ గ్రూప్ వాళ్ళు నిర్మించనున్నరని సమాచారం.దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో ఉండనున్నది.