ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ చాలా వినూత్నంగా జరిగాయి.అందువల్లే ఎప్పుడూ ఎనిమిది మంది ఉండే నామినేషన్స్ లో ఈసారి ఆరుగురు మాత్రమే ఉన్నారు.ఇక ఇప్పటివరకు పోల్ అయిన ఓట్స్ ను బట్టి ఎవరూ ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం
28 శాతం ఓట్లను దక్కించుకున్న షణ్ముఖ్ ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతుండగా,తర్వాత స్థానంలో 20 శాతం ఓటింగ్ దక్కించుకున్న మానస్ నిలిచాడు. ఇక 16 శాతం ఓటింగ్ దక్కించుకున్న శ్రీరామ్ చంద్ర మూడవ స్థానానికి పరిమితం అవ్వగా.షణ్ముఖ్ ఫ్యాన్స్ సపోర్ట్ తో సిరి 15 శాతం ఓట్లను దక్కించుకొని నాలుగవ స్థానంలో నిలిచింది.ఇక వీక్ వీక్ కు ఓటింగ్ పర్సంటేజ్ ను తగ్గించుకుంటున్న రవి 11 శాతం ఓట్లతో ప్రస్తుతం ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక 9 శాతం ఓటింగ్ తో లోబో ఆఖరి స్థానంలో నిలిచారు.