రోజురోజుకీ పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి దీంతో బండి బయటకి తీయాలంటేనే సామాన్యుడు భయపడిపోతున్నాడు. అయినా ఇవి ఎవి పట్టని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జేబులు ఖాళీ చేసే పనిలో కలిసి కట్టుగా పని చేస్తున్నాయి.దీంతో ప్రజలలో బిజేపిపై వ్యతిరేకత పెరిగిపోతుంది.ఇది ప్రమాదమని భావించిన బిజేపి పెట్రోల్ ధరలను తగ్గించకుండా మాటలతో మాయ చేసే చర్యలు చేపట్టింది.అందులో భాగంగా తాజాగా నితిన్ గడ్కరీ రంగంలోకి దిగారు.
త్వరలో కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్స్ ఇంజిన్ పాలసీని తీసుకొని రాబోతుందని ఈ పాలసీ కారణంగా ఇథనాల్ ఆధారిత ఫ్లెక్సీ ఇంజిన్ ల వాడకం పెరుగుతుందని దీనివల్ల పెట్రోల్ వాడకం తగ్గుతుందని ప్రజలకు పెట్రోల్ ధరల పెరుగుదల నుండి విముక్తి లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.భవిష్యత్తులో పెట్రోల్ ను ఇథనాల్ భర్తీ చేస్తుందని దీన్ని రైతులు సైతం ఉత్పత్తి చేయవచ్చని గడ్కరీ తెలిపారు.