మూవీస్ లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ప్రియ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది అందుకే ఆమె ఇంట్లో నుండి ఏడో వారం చివర్లో ఎలిమినేట్ అయ్యింది.లాస్ట్ వీక్ మొదట్లో యాని మాస్టర్ కంటే మెరుగైన ఓటింగ్ తెచ్చుకున్న ప్రియ సన్నీ గొడవతో యాని మాస్టర్ కంటే పోల్స్ తక్కువ ఓటింగ్ తెచ్చుకొని ఇంటి నుండి వెను తిరిగింది.ప్రియ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడంలో సన్నీ ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారు.
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ప్రియ బిగ్ బాస్ యాజమాన్యం నుండి అందుకున్న రెమ్యునరేషన్ గురించి తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ప్రచారం జరుగుతుంది దాని ప్రకారం దాదాపు ఏడు వారాల పాటు ఇంట్లో ఉన్న ప్రియ బిగ్ బాస్ యాజమాన్యంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వారానికి లక్ష 50 వేలు తీసుకుంది.అంటే ఇంట్లో ఉన్న ఏడు వారాలకి ఆమె దాదాపు 10 లక్షల 50 వేలు తీసుకుందట.
ప్రస్తుతం ప్రియ రెమ్యునరేషన్ కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.మరి దీనిపై ప్రియ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.