బిగ్ బాస్ లో లాస్ట్ వీక్ లాగే ఈ వారం కూడా నామినేషన్స్ సరికొత్తగా సాగాయి.ఇందులో కొందరు మాత్రమే వారి ఇంటి నుండి వచ్చిన లేఖలను తీసుకొని ఈవారం సేఫ్ అయ్యారు.ముందుగా హౌస్ లో లోబో,ప్రియాంకకు లెటర్స్ వచ్చాయి.ప్రియాంకకు లెటర్ ఇవ్వడం కోసం లోబో తన లెటర్ ను త్యాగం చేసి నామినేట్ అయ్యాడు.
ఇక ఆతర్వాత సిరి, విశ్వకు లెటర్స్ వచ్చాయి.విశ్వ కు లెటర్ ఇవ్వడం కోసం సిరి తన లెటర్ ను త్యాగం చేసి నామినేట్ అయ్యింది.మూడవసారి యాని మాస్టర్, మానస్ కు లెటర్స్ వచ్చాయి. మానస్ తన లెటర్ ను ముక్కలు చేయమని చెప్పి యానికి లెటర్ చదువుకునే అవకాశం ఇచ్చి నామినేట్ అయ్యాడు.
నాలుగవసారి రవి,శ్రీ రామ్ చంద్రకు లేఖలు వచ్చాయి చాలాసేపు డిస్కషన్ తర్వాత రవి తన లెటర్ ను త్యాగం చేసి శ్రీ రామ్ చంద్రకు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ పంపించిన లెటర్ చదువుకునే అవకాశం ఇచ్చి నామినేషన్స్ లో నిలిచాడు.
లాస్ట్ లో షణ్ముఖ్,కాజల్ కు వారి ఇంటి నుండి లెటర్స్ వచ్చాయి.షణ్ముఖ్ తన లెటర్ ను ముక్కలు చేసి కాజల్ కు లెటర్ చదువుకునే అవకాశం ఇచ్చి తాను నామినేట్ అయ్యాడు.ఈవారం కెప్టెన్ గనుక ఎటువంటి నిబంధనలు లేకుండా లెటర్ చదివే అవకాశం సన్నీకి దక్కింది.
ఇక మిగిలున్న జెస్సీ లెటర్ అందుకోవడం కోసం నామినేషన్స్ నుండి సేవ్ అయిన శ్రీ రామ్ చంద్ర ముందుకు వచ్చి తన లెటర్ ను మెషిన్ లో వేసి ముక్కలు చేసి నామినేట్ అయ్యాడు.ఈసారి నామినేట్ అయిన మెజారిటీ ఇంటి సభ్యులకు మంచి పాపులారిటీ ఉంది కావున ఈవారం నామినేషన్స్ ఇంటరెస్టింగ్ గా సాగనున్నాయి.ఈవారం ఇంటి నుండి వెళ్ళే అవకాశాలు లోబో,సిరికి ఎక్కువగా ఉన్నాయి