సోషల్ మీడియాలో తనని కించపరిచే వార్తలు ప్రచారం చేస్తూ తన పరువుకి భంగం కలిగించారని సమంత తాజాగా కోర్టు మెట్లు ఎక్కారు.తాజాగా దీనిపై టాప్ తెలుగు టీవి ఎక్జిక్యూటివ్ డైరెక్టర్,అన్ లైన్ తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్ లైన్ జర్నలిస్ట్ సంఘం ప్రెసిడెంట్ అయిన బి.ఎస్ స్పందించారు.
సమంత గారి జీవితంలో జరిగింది చేదు అనుభవమే కావచ్చు కానీ ఆమె సోషల్ మీడియా ఛానెల్స్ పై కేసు వేయడం మాత్రం మంచి పరిణామం కాదు.సామాన్యుడు చేతికి మొదటసారి సోషల్ మీడియా అనే ఆయుధం వచ్చింది.దాన్ని మనం ఎంత విసృతంగా వాడుతున్నామో మన జీవితాలలో అది ఎంతగా పెన వేసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.వారి పెళ్లి నుండి విడాకుల దాకా అన్ని సోషల్ మీడియాలో పంచుకున్న సమంత గారు సోషల్ మీడియాపై కేసు వేయడం ఏంటండీ ఇది మంచి పద్ధతి కాదు దీన్ని చూసి మరొకరు తయారవ్వకూడదు.
ఆన్ లైన్ జర్నలిస్ట్ సంఘం ప్రెసిడెంట్ గా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.మీరు పెట్టిన కేసులను వాపస్ తీసుకోండి మీరు ఒక మాట మాతో చెప్పి ఉంటే మీకు అభ్యంతరకరమైన పదాలన్నీ తొలగించడానికి మా ఛానెల్స్ అన్నీ సిద్దంగా ఉంటాయి మిమ్మల్ని బ్యాడ్ చేయాలనేది మా ఉద్దేశం కాదు.మేమంతా మీ అభిమానులం మీ సినిమాలు చూడడమే కాదు వాటిని ప్రమోట్ కూడా చేస్తున్నాం అలాంటి మా పై మీరు కేసులు పెట్టడం సరి కాదండీ.సోషల్ మీడియాతో పేన వేసుకున్న మీరు ఇలా కేసులు పెట్టడం వలన మరో నలుగురికి దారి చూపినట్టు అవుతుంది అది సమాజానికి మంచిది కాదు మీకు అభ్యంతరం అనిపించిన వ్యాఖ్యలు గురించి మాకు చెప్పండి వాటిని మేము వెంటనే తొలగిస్తాం కావున దయచేసి మీరు పెట్టిన కేసులను ఉపసంహరించుకోండి అని ఆమెను కోరారు.