ఈసారి బిగ్ బాస్ పెట్టిన కొత్తరకం నామినేషన్ ద్వారా ఇంటి సభ్యులు శ్రీరామ్, సిరి, రవి, కాజల్, జెస్సీ, ప్రియ, యానీ లను నామినేట్ చేశారు.ఇక సీక్రెట్ రూంలో ఉన్న లోబో ఈసారి డైరెక్ట్ గా నామినేట్ అవ్వడంతో మొత్తం 8 మంది ఇంటి సభ్యులు ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు.ఇక ఈవారం నామినేషన్స్ లో ఉన్న రవి,శ్రీ రామ్ కు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదవుతుంది.దీంతో ఈసారి ఇంటి నుండి బయటికి వెళ్లే అవకాశాలు ఎవరికి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం
ముందుగా ఇంట్లో చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తూ వచ్చిన జెస్సీ ప్రస్తుతం షణ్ముఖ్, సిరిలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ తను గేమ్ ఆడడం పూర్తిగా గాలికి వదిలేసి ఇన్ ఫ్లూయెన్స్ అవుతున్నాడు.ఈవారం షణ్ముఖ్ నామినేషన్స్ లేకపోవడంతో అతని ఓటింగ్ జెస్సికి కొంత హెల్ప్ అవుతుంది.
ఇక సీక్రెట్ రూంలో టైం స్పెండ్ చేస్తున్న లోబో ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.అందరి మనస్తత్వాలను సీక్రెట్ రూంలో నుండి చూసిన లోబో ఈ వీక్ ఎలిమినేషన్స్ నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గత వీక్ ఎలిమినేట్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శ్వేతను కూతురు కూతురు అంటూ బంధం కలుపుకున్న యానీ ఆతర్వాత టాస్క్ లో తొక్కలో రిలేషన్స్ నాకొద్దు అని నోరు జారీ ఆడియన్స్ కు డిస్ కనెక్ట్ అయ్యింది.ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఈమెకు చాలా ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం ప్రియ మీద బిగ్ బాస్ ఆడియన్స్ లో అసహనం ఎక్కువ అవుతుంది.ఆమెను ఈవారం ఇంటి నుండి పంపాలని ఆడియన్స్ ఫిక్స్ అయితేనే యానీ సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
సన్నీ ని కావాలని రెచ్చగొడుతూ ఓవర్ యాక్షన్ చేస్తూ అటు ఇంట్లో సభ్యులకు ఇటు ఆడియన్స్ కు చిరాకు తెప్పిచడంలో ప్రియ సక్సెస్ అవుతుంది.ఈవారం నామినేషన్స్ లో సన్నీ ని టార్గెట్ చేయడం కోసం పాపం రవిని బలి చేయడం ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేక పోతున్నారు.ప్రస్తుతం లాస్ట్ నుండి సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్న ఈమెను ఇంటి నుండి పంపేయడానికి సన్నీ అభిమానులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.మరి వారి ప్రయత్నాలు సక్సెస్ అయితే ఈవారం ఇంటి నుండి ఈమె బయటకి వెళ్లనున్నది.