తాజాగా గెడ్డం పెంచే వాళ్ళకు పరిశోధకులు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు.గతేడాది కుక్కల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధుల వల్ల ప్రమాదం ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం
స్విట్జర్లాండ్‌లోని హిర్స్‌ల్యాండెన్ క్లినిక్ ప్రొఫెసర్ ఆండ్రియాస్ గుట్జిట్ పశువులు MRI స్కానర్ ను ఉపయోగించి పలు పరిశోధనలు చేశారు.ఆ పరిశోధనలో భాగంగా కుక్కల బొచ్చులో పెరిగే బ్యాక్టీరియాను మనుషుల గడ్డాల్లో పెరిగే బ్యాక్టీరియాను ఆయన టీమ్ పరిశీలించారు.ఈ పరిశీలనలో కుక్కల బొచ్చులో కంటే మనుషుల గెడ్డంలో ఉండే బ్యాక్టీరియానే అత్యంత ప్రమాదకరమైందని తేలింది.
ఈ పరిశోధన కోసం ఆయన 18 మంది పురుషుల గడ్డాన్ని,30 కుక్కల మెడ వద్ద ఉండే బొచ్చును సేకరించారు.18 నుంచి 76 ఏళ్ల వయస్సు గల పురుషుల గెడ్డంలో అత్యధిక సూక్ష్మజీవులు ఉన్నాయని ఆయన గుర్తించారు.తాజాగా దీనిపై మాట్లాడిన ఆండ్రియాస్ గుట్జిట్ మా పరిశోధన అనంతరం మనుషల గెడ్డం కంటే కుక్కలు శుభ్రమైనవిగా చెప్పచ్చు.