ఈ అనంత విశ్వంలో మరో జీవరాశి ఉందా లేదా అనేది కనుగొనడం కోసం మన శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం గుట్టును మాత్రం చేధించలేకున్నారు.
తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో సౌర కుటుంబానికి సుదూరంగా ఉన్న నక్షత్ర మండలాల నుండి రేడియో సిగ్నల్స్ ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ది డచ్ లోఫ్రీక్వెన్సీ అరే యాంటినా సాయంతో తాము గుర్తించామని ఈ రేడియో సిగ్నల్స్ అసాధారణ లక్షణాలు కలిగి ఉన్నాయని నెదర్లాండ్ శాస్త్రవేత్తలు అంటున్నారు.దీంతో మరోసారి తెర పైకి ఏలియన్స్ గురించి చర్చ ఆరంభం అయ్యింది.