సన్ రైజర్స్ కు కీలక ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ ను సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తొలగించడానికి కారణం టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ అనే ప్రచారం జరుగుతుంది.మరి దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుత భారత్ హెడ్ కోచ్ గా కొనసాగుతున్న రవి శాస్త్రి తనకి అవకాశం ఉన్నప్పటికీ తన పదవిని ఎక్స్ టెండ్ చేసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు అందుకే ప్రస్తుతం బిసిసిఐ ఇండియన్ మెన్స్ జట్టుకు కొత్త కోచ్ ను వెతికే పనిలో పడింది.వారి దృష్టిని ఆకర్షించడానికి పేలవంగా ఆడుతున్న ప్లేయర్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తానని చెప్పడానికి వార్నర్ పై టామ్ మూడీ వేటు వేశారు.
ఈ వ్యవహారం హైదరాబాద్ కోచ్ ట్రెవర్ బేలిస్‌కి ఇష్టం లేకపోయినా టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ మాటను కాదనలేక సైలెంట్ అయిపోయారు.మరి టామ్ మూడి చేసిన ప్రయత్నం బిసిసిఐ దృష్టిని ఆకర్షిస్తుందో లేదో వేచి చూడాలి.