ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ ప్రేక్షకుల ముందుకు రెండు భాగాలుగా రానున్నది.ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీలో అనసూయ,సునీల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన సాంగ్స్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ సినీ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఈ మూవీతో ముచ్చటగా మూడవసారి కలిసి పని చేస్తున్న బన్నీ – సుకుమార్ త్వరలో నాలుగవసారి కలిసి పని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా లైవ్ లోకి వచ్చిన దర్శకుడు సుకుమారు త్వరలో ఆర్య3 మూవీ ఉండబోతుందని ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది అనడమే ఈ ప్రచారానికి కారణం అయ్యింది.