ఆఖరి లీగ్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 46 పరుగుల భారీ తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్ రన్ రేట్ తక్కువగా ఉండడం వల్ల టోర్నీ నుండి వెను తిరగాల్సి వచ్చింది.ఇక ఈ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో మాట్లాడిన రోహిత్ తాజాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోవడంపై స్పందించారు.
పాండ్యా గాయాన్ని ఫిజయోలు, ట్రైనర్లు, మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నారని ప్రస్తుతం అతని గాయం క్రమక్రమంగా నయమవుతుందని నెక్స్ట్ వీక్ నుండి అతడు బౌలింగ్ చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సీజన్ లో బౌలింగ్ లో బ్యాటింగ్ లో విఫలమైన ఈ ఆల్ రౌండర్ టి 20 వరల్డ్ కప్ లో ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సివుంది