శుక్రవారం ఎపిసోడ్ సగంలో ఆగిన కెప్టెన్సీ టాస్క్ తో మొదలైంది.బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ తో ప్రియ ఇంటికి కెప్టెన్ అయ్యింది.ప్రియ కెప్టెన్ కావడంతో అందరూ సంబరాలలో మునిగి తేలుతుంటే టాస్క్ లలో అద్భుతంగా పర్ఫాం చేస్తున్న ఇంట్లో వారు తమకి ఎవరూ సపోర్ట్ చేయలేదంటూ సన్నీ,మానస్ లు కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇక అందరినీ మ్యానిపులేట్ చేసే రవి ట్రాప్ లో తాజాగా కొత్త కెప్టెన్ ప్రియ పడిపోయింది.అతని సూచనలతో ఆమె ఇంట్లో వారికి వర్క్ ను డిసైడ్ చేస్తుంది.ఈ వీక్ అంతా అన్ని టాస్క్ లలో రాణించిన మానస్ కు రేషన్ మ్యానేజర్ ఇవ్వాల్సిందిగా పింకీ ప్రియని రిక్వెస్ట్ చేయగా దానికి యాని పింకీ ఇంట్లో కుక్ చేయడం మానస్‌కి సేవలు చేయడం మాత్రమే చేస్తుందని అన్నది దానికి బాధపడిన మానస్ పింకిని దూరం పెడుతున్నాడు.
లహరి వ్యవహరం జరిగినప్పటి నుండి రవితో దూరంగా ఉంటూ వస్తున్న ప్రియ ఈ ఎపిసోడ్ లో రవి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ కనిపించింది.ఇక కొత్త కెప్టెన్ తో తెగిపోయిన తన బంధాన్ని అతికించడానికి రవి ప్రియ వద్ద కాజల్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం ప్రారంభించాడు.ఇక ప్రతి వీక్ లాగే జైల్ లోకి ఒక వ్యక్తిని పంపడానికి బిగ్ బాస్ ఈవారం వరస్ట్ పర్ఫామర్ ఎవరో ఇంటి సభ్యులు చెప్పలేని ఆదేశించారు.ఇక ఈ టాస్క్ లో శ్వేత కాజల్ ను వరస్ట్ పర్ఫామర్ గా ఎంచుకుంది.
ఇక మొన్న కిచెన్ లో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న జెస్సీ శ్రీరామ్ ను వరస్ట్ పర్ఫామర్ గా ఎన్నుకున్నాడు.దీనిపై వీరిద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ అయ్యింది.షణ్ముఖ్ జస్వంత్,సిరి విశ్వని వరస్ట్ పెర్ఫామర్ గా ఎన్నుకొని ఒకటే రీజన్స్ ఇచ్చారు.
ఇక ఆతర్వాత వచ్చిన రవికి కాజల్ కు మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది.ఇంటి సభ్యులలో మెజారిటీ సభ్యులు కాజల్ ను వరస్ట్ పెర్ఫామర్ గా ఎన్నుకున్నారు.అందుకే పాపం కాజల్ ఈసారి జైలు పాలైంది.గురువారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ తో ఆడియన్స్ దృష్ఠిలో పాజిటివ్ ఆయిన యాంకర్ రవి మళ్ళీ నిన్నటి ఎపిసోడ్ తో బాగా నెగిటివ్ అయ్యాడు.