బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేముందు ప్రియాంక తన తల్లదండ్రుల వద్ద దాచిన నిజాన్ని బయటపెట్టింది.తను చేసిన తప్పును క్షమించమని కోరింది. తనని తన తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే అనుమానాలతో హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రియాంక,కోరికను తాజాగా బిగ్ బాస్ తీర్చారు.
ప్రియాంక తల్లిదండ్రులు తను ఎలా ఉన్నా తనని తాము ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తామనే ఒక రికార్డెడ్ మెసేజ్ ను బిగ్ బాస్ కు పంపారు.దాన్ని బిగ్ బాస్ హాల్ లో ఉన్న ఎల్. సి.డి టివిలో ప్లే చేయడంతో ప్రియాంక ఆనందానికి అవధులు లేవు.ఇలా ఎమోషనల్ గా బిగ్ బాస్ హౌస్ లో 31వ రోజు ఎండ్ అయ్యింది.ఇక పుష్పలోని దాక్కో దాక్కో మేకతో మొదలైన 32వ రోజున, సన్ని టీమ్ నుండి ఎవరైనా ఇంటికి కెప్టెన్ అయితే వారు హమిదా,శ్రీరామ చంద్రను ఊరకనే వదలరంటూ ప్రియ స్టేట్మెంట్ పాస్ చేసింది.
ఆ స్టేట్మెంట్ ను విన్న బిగ్ బాస్ జరగబోయే కథను ముందే ప్రియ పసిగట్టడం వల్లన కథలో మార్పులు చేయాల్సి వచ్చింది.అందుకే కాయిన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ తన దగ్గర హౌస్ మేట్స్ తక్కువ ఉన్నరనే కారణాన్ని చూపి సన్నిని పక్కన పెట్టి ,రవిని హౌస్ కు రాజును చేశారు అలాగే రవికి అవతలి టీమ్ వద్ద ఉన్న కాయిన్స్ ను తీసుకొని వాటిని తన టీమ్ లో ముగ్గురు కిచ్చి కెప్టెన్సీ పోటీదారులగా చేసే అవకాశాన్ని కల్పించారు.
ఇక చాలాసేపు డిస్కషన్స్ తర్వాత రవి వాళ్ళ టీమ్ నుండి హమిదా,యాని,శ్వేత లను కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నుకున్నారు.ఇక ఈ సీజన్ లో కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేకుండా పోయిన ప్రియకు బిగ్ బాస్ తిరిగి ఆ ఛాన్స్ ఇచ్చారు అందుకోసం ఈ వీక్ కెప్టెన్సీ నుండి హమిదా పోటిలో నుండి తప్పుకుంది.
బిగ్ బాస్ నిర్ణయంపై అసంతృప్తి చెందిన సిరి,జెస్సీ,కాజల్ అవతలి టీమ్ ను బ్లేమ్ చేయాలని చూశారు దానికి సన్ని అంగీకరించకపోవడంతో అతన్ని మ్యానిపులేట్ చేయాలని చూశారు.కానీ అది వర్క్ ఔట్ అవ్వలేదు.
ఇక ఈవారం కెప్టెన్ అవ్వడానికి కెప్టెన్సి అర్హులు 10 వేళ్ళు చాలవు అనే టాస్క్ లో పాల్గొన్నారు.ఈ టాస్క్ లో 10 రంధ్రాలు ఉన్న ట్యాంక్ నుండి ఎక్కువ నీళ్ళు పోకుండా ఎవరైతే ఆపుతారో వారే ఈ టాస్క్ లో గెలుపొంది విన్నర్ గా నిలుస్తారు.ఈ టాస్క్ కు షణ్ముఖ్ సంచలకుడిగా వ్యవహరిస్తున్నారు.టాస్క్ జరుగుతుండగానే ఈరోజు ఎపిసోడ్ పూర్తి అయ్యింది.