ప్రస్తుతం సౌత్ చైనా సీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న చైనా గత కొద్దిరోజులుగా తైవాన్ ఎయిర్ స్పేస్ లోకి తమ యుద్ధ విమానాలను పంపుతూ తాము యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలను పంపిస్తున్న నేపథ్యంలో తైవాన్ మేము సిద్ధంగానే ఉన్నాం అంటూ స్పష్టం చేసింది.ఈ విషయంపై జో బైడెన్ ను మీడియా వారు ప్రశ్నించగా నేను జిన్ పింగ్ తో చర్చించాను మేము ఇద్దరం తైవాన్ అగ్రిమెంట్ కు కట్టుబడి ఉన్నాం అంటూ కామెంట్ చేశారు.
అలాగే ఈరోజు అమెరికా,చైనా అధికార ప్రతినిధులు సమావేశం కానున్నారన్న విషయాన్ని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో చైనా,అమెరికా మధ్య ఉన్న సమస్యలపై ఇరు వర్గాల ప్రతినిధులు చర్చించబోతున్నట్లు సమాచారం.