ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యూనిసెఫ్, వాష్, పి అండ్ జి లతో కలిసి స్వేచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది.మెన్సురేషన్ సమయంలో బాలికల హాజరు తగ్గకుండా ఉండడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.ఈ కార్యక్రమాన్ని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ప్రారంభించనున్నారు.
ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వ విద్యాసంస్థలలో ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలకు స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం 7 తరగతి నుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థినిలందరికి వర్తించనుంది.ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థినిలందరికి ప్రభుత్వం నెలకు 10 నాప్కిన్ లు ఇవ్వడానికి అంగీకరించింది.