మన దేశంలో ప్రయాణించడానికి ఎక్కువగా రైల్ వేస్ ను వినియోగిస్తుంటారు.రైల్ వేస్ అయితే చీప్ అండ్ బెస్ట్ కాబట్టి ప్రజలు బస్ లు,విమానాల కంటే ఎక్కువగా రైల్ వేస్ నే ప్రిఫర్ చేస్తుంటారు.అయితే రైల్ వే స్టేషన్ లలో ప్లాట్ ఫామ్ పై ఎరుపు రంగు బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్ ను ఆనుకునే పసుపు రంగు గీత ఉంటుంది.అసలు ఈ బ్లాక్ ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రైళ్లు వేగంగా వస్తుంటాయి ఈ సమయంలో ఎక్కువగా గాలి వీస్తుంది.ఆ సమయంలో రైలుకి ప్రక్కగా ఎవరైనా నిలుచుంటే వారు రైలు కింద పడిపోయే ప్రమాదం ఉంది దీన్ని నివారించేందుకు రైల్ వే స్టేషన్ లలో ఈ బ్లాక్ ను ఉంచుతారు.రైలు వచ్చే సమయంలో ప్రజలు ఈ బ్లాక్ ను దాటి ముందుకెళ్ల కూడదని దీన్ని గీశారు.