దేవ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ చేసిన ‘రిపబ్లిక్’ మూవీకి మంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.ఈ సినిమాలో దర్శకుడు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తీసిన సీన్స్,డైలాగ్స్ సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో ప్రజల సమస్యలపై స్పందిస్తున్న తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తాజాగా ఈ మూవీ గురించి ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ లో రిపబ్లిక్ మూవీ గురించి గుడ్ రివ్యూస్ వింటునున్నాను ఈ మూవీని చూసేందుకు ఈగర్ గా ఎదురు చూస్తున్నట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు
Hearing some great reviews about #RepublicMovie. Looking forward to watch @devakatta and @iamsaidharamtej’s phenomenal work soon. Wishing Tej a speedy recovery and good health! #REPUBLIC pic.twitter.com/6KahQSnA8c
— Lokesh Nara (@naralokesh) October 3, 2021