జుట్టు రాలడం అనేది ప్రస్తుత జనరేషన్ లోని ప్రధాన సమస్యలలో ఒకటి.సాధారణంగా పోషకాహార లోపం,టెన్షన్,ఒత్తిడి వంటివి ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టు రాలడం అనేది జరుగుతుంది.ఈ సమస్యతో బాధపడుతున్న వారికి మార్కెట్ లో బోలెడు ఐటెమ్స్ అందుబాటులో ఉన్నాయి.కానీ వాటి విశ్వసనీయత చాలా తక్కువగా ఉంది.
మీ ఇంటి నుండే ఈ సమస్య నుండి ఉపశమనం పొందడం కోసం ముందుగా మూడు శీకాయలను చితక్కొట్టి వాటి నుండి గింజలను వేరు చేసుకోండి ఆతర్వాత 8 కుంకుడు కాయలను చితక్కొట్టి వాటి గింజలను పక్కన పెట్టుకోండి,ఇక చివరిగా 3 జామ ఆకులను తీసుకొని వాటిని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని మూడు ఇంగ్రిడియంట్స్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ గిన్నెలో కొద్దిగా నీటిని పోసి 7 నుంచి 8 నిమిషాలు మరిగించాలి.మరిగిన నీరు గోరువెచ్చగా అయ్యాక ఆ నీటితో తల రుద్దుకోండి.ఇలా చేయడం వల్ల మీ సమస్య రెండు వారాలలో నయం అవుతుంది