ఈమధ్య కాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి.వాటిలో ఎక్కువగా గుండె మంట సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు.ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే మందులతో పాటు ఆహార అలవాట్లు మార్చుకోవాలి.మరి ఈ సమస్య మార్చుకోవాల్సిన ఆహార అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా నూనెలో బాగా వేయించిన పదార్థాలను తీసుకోవడం తగ్గించుకోవాలి.అలాగే క్యాబేజీ, బ్రోకలీ, ముల్లంగి కూడా తీసుకోవడం తగ్గించుకోవాలి ఎందుకంటే ఇవి అరగడనికి సమయం ఎక్కువ తీసుకుంటాయి మసాలా పదార్థాలు తీసుకోవడం,సిట్రస్ పండ్లను తీసుకోవడం తగ్గించుకోవాలి అప్పుడే గుండె మంట సమస్య నుండి ఉపశమనం పొందగలరు.