రాజ్యాంగ స్ఫూర్తిని నిలిపేందుకు పని చేయాల్సిన కోర్టులు అప్పుడప్పుడు ఇచ్చే తీర్పులు వివాదాస్పదం అయ్యి సమాజంలో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంటాయి.తాజాగా ఇలాంటి ఓ సంఘటనే స్పెయిన్ లో చోటు చేసుకుంది.
స్పెయిన్ లోని కెర్వో పట్టణంలో మారుజైనా అనే వేడుకను 2019లో నిర్వహించారు.ఈ వేడుకలో మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు.అధికారులు ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించుకున్న మహిళలు వీడియోలును కొందరు ప్రబుద్ధులు చిత్రీకరించి వాటిని ప్రైవేట్ వెబ్ సైట్లకు అమ్మారు.
ఇక తమ వీడియోలను చిత్రకరించరన్న విషయాన్ని తెలుసుకున్న మహిళలు వెంటనే ఈ అంశంపై కోర్టులో పిటిషన్ వేశారు.రెండేళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో తాజాగా కోర్టు బహిరంగ ప్రాంతాల్లో ఎవరైనా షూట్ చేసుకోవచ్చని, కాబట్టి దీన్ని నేరంగా పరిగణించలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆ కోర్టు చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి